ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి `నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెసలదిన్నె చెరువును పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమం నాలుగు దశల్లో అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు, అనంతరం 5 రోజుల్లో రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ నిర్వహించబడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు సాధ్యమవడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షులు, నీటి సంఘాల ప్రతినిధులు, ఎల్‌ఎల్‌సీ డీఈ మరియు ఏఈ, సంబంధిత శాఖ అధికారులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










