అన్నమయ్య జిల్లాలో ‘జలధార’ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
మంగళవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కలెక్టర్ తన ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను వివరించారు. కేవలం ఐదు నెలల్లోనే భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం.
962 చెరువుల పునరుద్ధరణ వంటి ఫలితాలను పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే మార్గదర్శకమని, ఇతర జిల్లాల్లోనూ దీన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.










