గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మత్తు పదార్దాలు వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాలు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు, ఎటీఎం, OTP వివరాలు అడిగితే చెప్పవద్దన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.
#RAJESH










