చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు మంగళవారం తమ రూటు మార్చుకున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
కల్లూరు, పాలెం, దేవళంపేట, కమ్మపల్లి పంచాయతీలలో సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయడంతో ఏనుగులు రాయవారిపల్లి పంచాయతీ వైపు మళ్లాయి. అక్కడ మూడు రోజులుగా పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు# కొత్తూరు మురళి.










