మదనపల్లె: హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం.

0
0

మదనపల్లె పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇడ్లీ పాత్రలు, ప్లేట్లలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని, వాటికి బదులుగా అరిటాకులను మాత్రమే ఉపయోగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.

నిబంధనలు పాటించని హోటళ్లపై భారీ జరిమానాలు విధించి, మూసివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.