రఘురామ కృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలి: నీలం నాగేంద్రరావు డిమాండ్

0
1

ఆకువీడు మాలపేటపై పోలీసు బలగాలతో దాడికి పాల్పడ్డ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలని దళిత నేత నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం చీరాల అంబేద్కర్ భవన్‌లో జరిగిన

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకువీడు ఘటనలో 63 మంది మాలలపై తప్పుడు కేసులు పెట్టి, విద్యార్థులను, మహిళలను అరెస్టు చేయడం ప్రభుత్వ అణచివేతకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ దాడిని ఖండించడంలో అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ విఫలమయ్యాయని విమర్శించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంటనే స్పందించి రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించాలని ఆయన డిమాండ్ చేశారు.