ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి 170 కోట్లు

0
1

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం (IGMC) అభివృద్ధికి రూ.170 కోట్లతో భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఖేలో ఇండియా నిధులతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

మూడు దశల్లో స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, 2029 నాటికి నేషనల్ గేమ్స్ నిర్వహించడమే లక్ష్యమని తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలుపుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.