భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్ఎం (బోధన అభ్యసన సామాగ్రి) పోటీల్లో వేములవాడ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు కోడం రాధిక సత్తా చాటారు. పరమాణువు నిర్మాణం (Atomic Structure) అంశంపై ఆమె రూపొందించిన నమూనాకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో రాధికను ప్రధానోపాధ్యాయులు బి. బన్నాజి నేతృత్వంలో తోటి ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ విజయంతో పాఠశాల కీర్తి జాతీయ స్థాయికి చేరిందని, విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. కృష్ణ, వి. బాలరాజు, పి. సత్యనారాయణ, ఏ. సరళ, టి. సరిత, టి. బాబు రాజు, జె. రవీందర్ రావు, ఎన్. స్వాతి, సి.హెచ్. అరుంధతి తదితరులు పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు.










