పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన గంగ జాతర బుధవారం రాత్రి అమ్మవారి జల్దీ కార్యక్రమంతో వైభవంగా ముగిసింది.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
‘ఈ సంవత్సరం వెళ్లి వచ్చే సంవత్సరం రావమ్మా, భక్తులను చల్లగా కాపాడమ్మా’ అంటూ ఆశాదీరాల వారు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










