మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన కళ్యాణ్, మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా, బసినికొండ ఆర్చి వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని బైకు ఢీకొట్టింది. స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.










