మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత… ఫుట్‌పాత్ షాపుల తొలగింపు.|

0
3

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన చిన్నపాటి దుకాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు కలిసి తొలగించే చర్యలు చేపట్టారు.

అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తుతో రంగంలోకి దిగి, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఫుట్‌పాత్‌లపై ఉన్న షాపులను తొలగించడంతో స్థానిక చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు.

“సామాన్లు సర్దుకునేంత సమయం కూడా ఇవ్వకుండా తొలగిస్తున్నారు” అంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారాన్ని ఒక్కసారిగా దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు.

ఇక అధికారులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న అక్రమ ఆక్రమణలను తొలగించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

#sidhumaroju

Alwal