మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ నాయకులను, మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ, “ఏబీఎన్ అంటే ఆల్ టైం బోగస్ న్యూస్” అని విమర్శించారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా, కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచే స్థాయికి దిగజారడం తగదని హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.










