పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) మరియు చౌడేపల్లి మండల నాయకులు, కార్యకర్తలు చిత్తూరు జిల్లా పుంగనూరులోని చౌడేపల్లిలో నేడు జరిగిన నడివీధి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు.
వారు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ప్రజలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










