వైసీపీ అధినేత జగన్ రాజకీయ తీరుపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మాటలకు నిలకడ లేదని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజలకు దూరంగానే ఉంటారని ఎద్దేవా చేశారు. పార్టీ శిక్షణా తరగతుల్లో భాగంగా ‘టీడీపీ 3.0’ వర్షన్‌ను లోకేశ్ పరిచయం చేశారు.
పార్టీలో 33 శాతం కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, పైరవీలకు తావులేకుండా కేవలం పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. నాయకులు శాశ్వతం కాదని, పార్టీనే శాశ్వతమని పేర్కొంటూ.. క్షేత్రస్థాయి నుంచి నాయకత్వాన్ని నిర్మిస్తామన్నారు. కార్యకర్తలు అహంకారం వీడి, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విజయాలను చాటాలని పిలుపునిచ్చారు.










