ఏపీ రాజధానిగా జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. “ఇంకా నయం ‘వాటికన్’ అనలేదు” అంటూ ఎద్దేవా చేశారు. అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని, దీనికి పార్లమెంటులో 49 పార్టీల మద్దతు ఉందని స్పష్టం చేశారు.
వైసీపీని “సైకో పార్టీ”గా అభివర్ణిస్తూ, గతంలో మహిళలను అవమానించిన వారు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని వేమూరు సభలో హెచ్చరించారు.










