ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని, వర్సిటీ ఘనతను కొనియాడారు. ఏయూ కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన భారతీయ వారసత్వ సంపద అని ఆయన అన్నారు.
సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్ వంటి మహనీయుల కృషిని స్మరించుకున్నారు. తన ఆప్తుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడే గోల్డ్ మెడల్ సాధించారని గుర్తుచేస్తూ, ఏయూ మేధావులను, నాయకులను తయారుచేసే గొప్ప వేదికని ప్రశంసించారు. విద్యార్థులు విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు.










