సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోయగూడాలోని మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “అనీమియా ముక్త్ భారత్” పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం కుటుంబ నియంత్రణ, జాతీయ పోషకాహార విలువలు, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం, శిశు సంరక్షణపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. మిడ్ వైఫరీ విధానాన్ని మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మాతా-శిశు సంరక్షణ కేంద్రాలను పెంచి, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మిడ్ వైఫరీల సంఖ్య పెరిగితే శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. గత రెండేళ్లలో 7 వేలకుపైగా నర్సులను నియమించామని వెల్లడించారు.
#sidhumaroju
Alwal










