పాత పగతో వ్యక్తిపై గ్రామస్తుల దాడి, తీవ్ర గాయాలు.

0
0

అన్నమయ్య జిల్లా నారిగణిపల్లి పంచాయతీ దిగువ లంబంవారి పల్లి గ్రామంలో పాత పగల కారణంగా ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా దుండగులు మళ్లీ అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.