బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా పుంగనూరులో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న
ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల్లో మద్దతు కూడగట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మద్దతును సమీకరించేందుకు ఈ దీక్ష కొనసాగుతుందని వారు పేర్కొన్నారు# కొత్తూరు మురళి.










