ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|

0
19

మల్కాజ్‌గిరి:  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రాంతంలో బస్ షెల్టర్ల అవసరం, దోమల సమస్య తీవ్రత, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు అవసరం వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లోతుకుంట ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైన్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

ఈ విషయాలపై స్పందించిన కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal