*బి.బి.ఎ. మీడియా కమిటీ ఛైర్మన్‌గా జయప్రకాష్ నియామకం*
*విజయవాడ:- అత్యంత ప్రతిష్టాత్మకమైన బెజవాడ బార్ అసోసియేషన్ (బి.బి.ఎ.) మీడియా కమిటీ ఛైర్మన్‌గా విష్ణుబొట్ల జయప్రకాష్(జేపీ) నియమితులయ్యారు. ఈ మేరకు బి.బి.ఎ. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ, వలిబోయిన కిరణ్‌కుమార్‌లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బెజవాడకు చెందిన విష్ణుబొట్ల జయప్రకాష్ గతంలో మీడియా రంగంలో విశేష అనుభవంతో పాటు జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, సోషయాలజీ.
సైకాలజీ వంటి అంశాలలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేసి ఉండడంతో జయప్రకాష్‌ను ఛైర్మన్‌గా నియమించారు. అదేవిధంగా కన్వీనర్లుగా సీనియర్ న్యాయవాదులు పి.వి.ఏడుకొండలు, వి.రాయప్ప, సభ్యులుగా పి.నగేష్‌కుమార్, వంగా రమేష్ కుమార్, ఎ.సురేష్‌కుమార్, ఉప్పాల శ్రీనివాసరావు, పి.ఎస్.ఆర్. ప్రసాద్ బాబు, పి.సత్యనారాయణ, సోగాని రమేష్‌కుమార్, పి.ఎస్.ఆర్. ప్రసన్నజి, గగన సింధూ, పోతూరు చరణ్ సుధామ్స్‌లను నియమించారు.*
*క్రమశిక్షణ కమిటీ నియామకం..*
*క్రమశిక్షణ కమిటీలో సీనియర్ న్యాయవాదులు డి.ఎస్.మహేంద్ర, టి.వి.నవకుమార్, పెద్దిబోయిన (బండి) జ్యోతిలను నియమిస్తూ బి.బి.ఎ. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ, వలిబోయిన కిరణ్‌కుమార్‌లు ఉత్వర్వులు జారీ చేశారు.*










