మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన ‘జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్’ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక స్టేషన్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్లిష్టమైన ఆస్తిపాస్తి నేరాలు.
చోరీ కేసులను వేగంగా ఛేదించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి బాధితులకు త్వరగా న్యాయం అందించాలని, నేరస్తులను పట్టుకుని ప్రజల సొత్తును రక్షించాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.










