ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేయనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ, భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ఈ పర్యటనలో ప్రధానాంశం.
సీఎం పర్యటన షెడ్యూల్:
-
ఉదయం 10:50: సూరేపల్లి గ్రామానికి చేరుకుంటారు.
-
ఉదయం 11:00: ప్రజావేదిక సభలో ప్రసంగం.
-
మధ్యాహ్నం 01:35: వ్యవసాయ క్షేత్ర పరిశీలన, రైతులతో ముఖాముఖి.
-
మధ్యాహ్నం 02:10: పార్టీ శ్రేణులతో సమీక్ష.
-
సాయంత్రం 04:05: అమరావతికి తిరుగు ప్రయాణం.










