సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనివ్వాలి: కలెక్టర్ కుమార్ దీపక్

0
0

మంచిర్యాల జిల్లా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ‘సురక్షిత మాతృత్వం’ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

జిల్లాలో ఇప్పటివరకు 4,485 ప్రసవాలు జరగ్గా, అందులో 1,870 సాధారణ ప్రసవాలని తెలిపారు. “సాధారణ ప్రసవాలు ముద్దు – సిజేరియన్లు వద్దు” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంచాలని, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భవతులను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం గర్భవతులకు పండ్లు పంపిణీ చేశారు.