MLC Kalvakuntla kavitha announcing new party on 25th April

0
2

ఈ నెల 25న కొత్త పార్టీ ప్రకటన – కవిత

ఈ నెల 25న తమ కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలేనని ఆమె వ్యాఖ్యానించారు.

తమ పార్టీ మాత్రం తెలంగాణకు చెందిన ఇంటి పార్టీగా ఉంటుందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రకటన కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.