చంద్రబాబు రెవెన్యూ సమీక్ష: లక్షలాది కుటుంబాలకు వరాలు

0
1

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుండి తొలగించి రైతులకు విముక్తి కల్పించారు. 2016కు ముందు గృహ పట్టాలు పొందిన 75 లక్షల కుటుంబాలకు పూర్తి ఆస్తి హక్కులు కల్పించాలని ఆదేశించారు.

‘రీసర్వే 2.0’ ద్వారా 2027 మార్చి నాటికి 1.12 కోట్ల మందికి కొత్త పాసుపుస్తకాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టారు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వాడుతూ, రికార్డులను యజమానుల మొబైల్‌కే పంపేలా డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.