జనం మెచ్చిన నాయకుడు: ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
0

ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ABN రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా భారీ ఆందోళన చేపట్టారు. ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేసి, రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ABN యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “మావిగాన్” కార్యక్రమానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఎల్లో మీడియా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో కొందరికే లాభం చేకూరుస్తోందని విమర్శించారు. పచ్చ మీడియా క్షమాపణ చెప్పే వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బసిరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.