అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ, ఆనంద్ తమ మూడు సెంట్ల భూమిని నకిలీ రికార్డులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో బాధితురాలు పద్మ మాట్లాడుతూ.
మగారాల వేణు, పుష్పలత, హేమ సుందరం తమపై దాడికి దిగుతున్నారని, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరారు









