బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అత్యాధునిక క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆయన, జగన్ వంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆపలేరని స్పష్టం చేశారు. అమరావతి మనందరి రాజధాని అని, దీని ద్వారా సంపద సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. వేమూరు నియోజకవర్గానికి కొత్త వంతెనలు, ఫైర్ స్టేషన్ మరియు ఎంఎస్ఎంఈ పార్కును మంజూరు చేస్తూ వరాల జల్లు కురిపించారు.










