చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు, మల్లికా రాణి మరియు ఇతర శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యంగా మహిళల సంరక్షణకు, వారికి అందాల్సిన పథకాలను తెలియజేస్తూ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. భారతీయ శాస్త్రీయ, సాంస్కృతిక, భగవద్గీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు# కొత్తూరు మురళి.










