మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. బుధవారం మున్సిపల్ నీళ్ల ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రిలోని డ్రమ్ములను నింపినట్లు ఆర్‌ఎంఓ రాధిక తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రి అవసరాల కోసం రోజుకు సుమారు ఐదు ట్యాంకర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీటిని ప్రసూతి, చిన్న పిల్లల, అత్యవసర వార్డులతో పాటు ఐసియు విభాగాలకు మళ్లించనున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సహకారంతో నీటి కొరతను అధిగమించేందుకు మార్గం సుగమం చేశారు.









