మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై మంగళవారం రాళ్లు, కర్రలతో దాడి చేసి కాలు విరగ్గొట్టారు.
వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమిని రామకృష్ణ, రామయ్య, రెడ్డప్ప తదితరులు ఆక్రమిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. గతంలో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినా, ఆమెకు అండగా ఎవరూ లేరనే ధీమాతో నిందితులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.









