లోక్ అదాలత్ సక్సెస్: పోలీసు అధికారులకు జిల్లా జడ్జి ప్రశంసలు

0
1

పెద్దపల్లి జిల్లాలో మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతమైన సందర్భంగా జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల పోలీసు అధికారులను అభినందించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో పోలీస్ శాఖ చూపిన చొరవను కొనియాడుతూ, కీలక పాత్ర పోషించిన అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు. న్యాయ వ్యవస్థ మరియు పోలీసుల సమన్వయంతోనే బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ, కేసుల పరిష్కారానికి సహకరించిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అదనపు జిల్లా జడ్జి స్వప్న రాణి, ఏసీపీలు రమేష్, కృష్ణ మరియు ఇతర న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.