మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ‘ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్’ జిల్లా స్థాయి ప్రదర్శనలో సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ పాల్గొన్నారు.
విద్యార్థులు చిన్నతనం నుంచే సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలతో వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.
పాఠశాల విద్యాశాఖ, ఉద్యం సంస్థ సంయుక్తంగా 9వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చాయని తెలిపారు. ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.










