సింగరేణిలో పూలే జయంతి: కార్మికులకు వ్యాసరచన పోటీలు

0
0

ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీసీ లైజన్ ఆఫీసర్ మరియు శ్రీరాంపూర్ ఏరియా బీసీ & ఓబీసీ ఏరియా కమిటీ నాయకత్వంలో సమావేశం నిర్వహించబడింది,జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించబడునని.

శ్రీరాంపూర్ ఏరియా జి ఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అన్ని బొగ్గు గనులు మరియు డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఆసక్తి గల ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొనలని వారు తెలిపారు,పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడునని ,అందరూ సమన్వయంతో పాల్గొని జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని,బీసీ&ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్అసోసియేషన్ తెలిపింది.