మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఆడిట్ గురువారం జరిగింది. కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఆడిటర్లు డాక్టర్ ఎం. రుక్మిణి, డాక్టర్ ఎస్. గులాబ్ జాన్ రికార్డులను పరిశీలించి, నిర్వహణ విధానాలను తనిఖీ చేశారు.
ఈ ఆడిట్ ఫలితంగా కళాశాలకు ‘ఎ’ గ్రేడ్ లభించింది. ప్రిన్సిపాల్ వై. వనజ మాట్లాడుతూ, అధ్యాపకుల కృషి వల్లే ఈ ఘనత సాధించామని తెలిపారు.










