ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నందవరం, గోనేగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లోని ప్రముఖ ఆలయాల్లో గోపురాల నిర్మాణం, కళ్యాణ మండపాలు, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
దేవాలయాలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓలు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.










