చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్‌ను టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని, వారి సామాజిక, విద్యాభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మైనారిటీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఉర్దూ అకాడమీ సేవలను కొనియాడారు.










