జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ

0
3

భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి టీఎల్‌ఎం (బోధన అభ్యసన సామాగ్రి) పోటీల్లో వేములవాడ పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కోడం రాధిక ద్వితీయ బహుమతి సాధించారు. ‘పరమాణువు నిర్మాణం’ (Atomic Structure)పై ఆమె రూపొందించిన నమూనాకు ఈ గుర్తింపు లభించింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. బన్నాజి నేతృత్వంలో తోటి ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సత్కరించారు. రాధిక సాధించిన ఈ విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, పాఠశాల కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని సహచరులు కొనియాడారు.