తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

0
1

మరిపెడ తెలంగాణ మోడల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 10వ తరగతి ప్రవేశ పరీక్షలు ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ అఖ్తరుజ్జమాన్ తెలిపారు. 6వ తరగతికి ఉదయం, మిగిలిన తరగతులకు మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి.

అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 10 నుండి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 100 మార్కుల ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని, OMR షీట్ ద్వారా సమాధానాలు గుర్తించాలని ఆయన సూచించారు.