ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సుమారు రూ.39,436 కోట్ల విలువైన 31 పారిశ్రామిక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతి రాజధాని నిర్మాణం, ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థ ఖరారు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
అలాగే, విద్యా రంగంలో ఫీజుల నియంత్రణకు ఆర్డినెన్స్, అమరావతికి రాజధాని హోదాపై కేంద్రానికి ధన్యవాద తీర్మానం చేసే అవకాశం ఉంది. భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.










