విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జగ్గయ్యపేటలో రూ. 7.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిలో భాగమైన జగ్గయ్యపేటను రానున్న రెండేళ్లలో భారీ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు.
డిఫెన్స్ పరిశ్రమలు, టాటా వాటర్ వంటి ప్రాజెక్టుల కోసం 1400 ఎకరాల భూసేకరణపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’ హోదాతో కేంద్ర నిధులు వస్తాయని, రైల్వే ప్యాసింజర్ సేవలు, తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంపీ వెల్లడించారు.










