“పోలీస్ డ్యూటీ మీట్‌లో నవీన్ సత్తా… స్వర్ణం, కాంస్యం సాధన.|

0
0

మల్కాజిగిరి జోన్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ నవీన్ అఖిల భారత స్థాయిలో ప్రతిభ చాటారు. నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్-2025లో ఆయన రెండు పతకాలు సాధించారు.

మెడికో-లీగల్ ఓరల్ విభాగంలో స్వర్ణ పతకం, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ & ప్యాకింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన నవీన్‌ను బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఆయన నైపుణ్యం పోలీస్ శాఖకే గర్వకారణమని అధికారులు కొనియాడారు.

#sidhumaroju