భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలి.

0
1

హనుమకొండలోని చారిత్రక భద్రకాళి చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మే 15వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మొత్తం 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. చెరువు నుంచి తీసిన మట్టిని అమ్మవారిపేటలోని ప్రభుత్వ భూముల్లో నిల్వ చేయాలని, ఆ భూములు ఆక్రమణకు గురికాకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.