భూ రికార్డుల భద్రతకు కరెన్సీ టెక్నాలజీ: సీఎం చంద్రబాబు.

0
2

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూ రికార్డుల భద్రత కోసం కరెన్సీకి వాడే అత్యాధునిక బ్లాక్‌చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్‌లను ఉపయోగిస్తున్నామని, దీనివల్ల రికార్డుల తారుమారు అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ లక్ష్యంగా ‘రీ సర్వే 2.0’ చేపట్టారు. ఆటో-మ్యూటేషన్ ద్వారా పాస్‌బుక్‌లను నేరుగా ఇంటికే పంపాలని, 22A నిషేధిత జాబితా నుంచి ఇనాం భూములను తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భూ రికార్డుల రక్షణకు ‘రికార్డుల లాకర్ సిస్టమ్’ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.