మదనపల్లె మండలంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం పొన్నేటిపాలెం పంచాయితీ చిప్పిలికి చెందిన నాగిరెడ్డి (46) తన అన్న చెన్నకేశవరెడ్డిని వ్యవసాయ భూమిలో వాటా అడిగాడు.
ఈ విషయమై రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహంతో అన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










