మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45) తీవ్రంగా గాయపడ్డాడు.
వ్యక్తిగత పనిమీద మదనపల్లెకు బైక్‌పై వెళ్లిన గుణశేఖర్, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న నీటి ట్యాంకర్‌కు సైడ్ ఇచ్చే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.










