మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూటీ, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.










