జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజు క్రీడలను సాధన చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా యువజన క్రీడా సేవలాధికారి హనుమంత రెడ్డి, ప్రిన్సిపాల్ సులేమాన్ తో కలిసి వైద్య విద్యార్థుల కోసం క్రీడా సామాగ్రిని అందజేశారు.
వైద్య వృత్తి సవాళ్లతో కూడుకుందని, ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలకు సమయం కేటాయించాలని ఆయన సూచించారు.










