మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, IAS, కౌకూర్‌లోని మోడల్ మార్కెట్–మహిళా మండల్ వద్ద కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.
మహాదేవపూర్, కౌకూర్ ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలు, ఇరుకైన వీధుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గమనించారు. అత్యవసర సేవలు, స్కూల్ బస్సులు చేరుకోలేని పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలను సామాజిక కార్యకర్త తుడిమెల్ల మల్లికార్జున మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కమిషనర్ సంచిత్ గంగ్వార్ స్థలాన్ని సందర్శించి, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సుమారు 300 ఇళ్లకు కీలక మార్గమైన ఈ రహదారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










